New Education Policy : నూతన విద్యా విధానం పై సీఎం జగన్ సమీక్ష!

New Education Policy : నూతన విద్యా విధానం పై సీఎం జగన్ సమీక్ష!
x

ys jagan mohan reddy

Highlights

New Education Policy : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

New Education Policy : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారంసమీక్ష నిర్వహించారు.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ తో పాటుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం విద్యాశాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆములు చేస్తున్న మెజారిటీ అంశాలు అందులో ఉన్నాయని అన్నారు..ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామని.. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఒక ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.

ఇక పీపీ1, పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచుతున్నామని అన్నారు.. హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయని, అయితే అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమేనని అన్నారు. ఇక యధావిధిగానే 10 తరగతిలో బోర్డు పరీక్షలు ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి అన్ని విధాలుగా సమర్ధవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.. ఇక ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories