గ్రామ వాలంటీర్లకు ఇక డ్రెస్ కోడ్..

గ్రామ వాలంటీర్లకు ఇక డ్రెస్ కోడ్..
x
Highlights

అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా...

అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా వాలంటీర్ వ్యవస్థను పరిచయం చేసింది. సంక్షేమ ఫలాలన్నీ వాలంటీర్ల ద్వారానే అందించేలా మార్పులు తీసుకొచ్చింది. అనుకున్నట్లుగా తగిన ఫలితాలను కూడా అందుకోగలుగుతోంది. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను మరింత మార్పులతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. గ్రామ సచివాలయ వ్యవస్థను కలర్‌ఫుల్‌గా మార్చేందుకు సిద్ధమవుతోంది.

గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది న్యూ లుక్‌తో కనిపించేలా డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పురుషులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్‌ కలర్‌ ప్యాంట్‌, మహిళలకు స్కై బ్లూ టాప్, బిస్కెట్‌ కలర్‌ లెగిన్‌‌ ఉండేలా డ్రెస్‌ కోడ్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వారి శాఖలు తెలిసేలా ట్యాగ్‌ కలర్స్‌ కూడా చేర్చనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories