AP CM Jagan: ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు పనిచేయాలి..

Andhra Pradesh Should Be  A Drug Free State
x

నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలి

Highlights

YS Jagan: ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ విస్తృతంగా ప్రచారం చేయాలి

YS Jagan: ఆంధ్రప్రదేశ్‎ను నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో SEB, ఎక్సైజ్‌ శాఖపై క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ సమీక్షించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు పని చేయాలన్నారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో డ్రగ్స్ వాడకం వల్ల ఎదురయ్యే అనర్థాలు తెలియచెప్పేలా భారీ హోర్డింగ్స్‌ పెట్టాలని సూచించారు. SEB టోల్‌ఫ్రీ నెంబర్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, SEB పూర్తి సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలని.. మరో రోజు పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలన్నారు. ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలన్న సీఎం జగన్ అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయాల మహిళా పోలీస్‌లనూ సమన్వయం చేయాలని వారి సేవలను ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళా పోలీస్‌ల పనితీరు ఇంకా మెరుగుపర్చాలన్న ఏపీ సీఎం జగన్.. దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు కావాలని ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories