సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకువెళ్ళవచ్చు : ఏపీ పోలీసులు

సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకువెళ్ళవచ్చు : ఏపీ పోలీసులు
x
Highlights

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు.. లాక్ డౌన్ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకువెళ్ళవచ్చునని వెల్లడించారు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు.. లాక్ డౌన్ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకువెళ్ళవచ్చునని వెల్లడించారు. అయితే వాహనాలకి సంబంధించిన పాత్రలను పోలిస్ స్టేషన్ లలో అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అయితే ఆ వాహనాలపై ఉన్న చలానాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్‌లో కూడా సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించాయి. అయితే కొందరు ఎదో వంకతో లాక్ డౌన్ నిబంధనలని పక్కన పెట్టి రోడ్ల పైకి వచ్చారు. దీనితో పోలీసులు ఆ వాహనాలను సీజ్ చేశారు. ఇప్పుడు లాక్‌డౌన్ సడలించడంతో ఆ వెహికల్స్‌ను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఇక అటు తెలంగాణలో ఇప్పటికే సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఏపీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories