Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3: పోలింగ్ Live Updates

ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

Show Full Article

Live Updates

  • 17 Feb 2021 2:38 AM GMT

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ప్రజలు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

  • 17 Feb 2021 2:22 AM GMT

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    ♦ మూడో విడతలో 3వేల 221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

    ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

    దీంతో మిగిలిన 2వేల 639 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7వేల 757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19వేల553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43వేల612 మంది పోటీలో ఉన్నారు. 

  • 17 Feb 2021 2:21 AM GMT

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    ఏపీ వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26వేల 851 పోలింగ్‌ కేంద్రాలలో మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు.పోటీలో ఉన్న 51వేల 369 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళే తేలిపోనుంది.

Print Article
Next Story
More Stories