Alla Nani about Anganwadi Centers: మారనున్న అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు..

Alla Nani about Anganwadi Centers: మారనున్న అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు..
x

AP Health Minister Alla Nani

Highlights

Alla Nani about Anganwadi Centers | అంగన్వాడీ కేంద్రాలు రూపు రేఖలు పూర్తిగా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించినట్టు ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Alla Nani about Anganwadi Centers | అంగన్వాడీ కేంద్రాలు రూపు రేఖలు పూర్తిగా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంకల్పించినట్టు ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.. అంగన్వాడీ కేంద్రాల్లో కూడ నాడు -నేడు కార్యక్రమంలో రన్నింగ్ వాటర్, టాయిలెట్స్, విద్యుదీకరణ, కిచెన్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు, గోడలపై పెయింటింగ్స్ తో పాటు, క్రీడా స్థలం ఉండేలా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు... ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఉమెన్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్,అంగన్వాడీ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు...

కొత్త భవనాలు నిర్మాణంలో తొలి దశలో 17, 984, రెండవ దశలో 9454కేంద్రాలు నిర్మాణం చేయాలని, తొలి దశ పనులు ఈ ఏడాది డిసెంబర్లో మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి ఆళ్ల నాని చేప్పారు.. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ నాటికీ స్థలాలు గుర్తింపు పూర్తి చేసి, ఆ తర్వాత అంగన్వాడీ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు, మెటీరియల్ సేకరణ, ఇతర పనులు అన్ని పూర్తి చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 1న పనులు మొదలు పెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికీ పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం అని, నవంబర్ రెండోవ వారం నుండి పి పి -1, పి పి -2స్కూల్స్ ప్రారంభం చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఉమెన్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు సూచించారు.. పశ్చిమగోదావరి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలు స్థానంలో సొంత భవనాలు నిర్మాణానికి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని, ఏలూరు నియోజకవర్గంలో పరిధిలో గ్రామీణ ప్రాంతంతో పాటు అర్బన్ ఏరియాలో కూడ అంగన్వాడీలు బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు..

ఏలూరు నియోజకవర్గంలో 151అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో దాదాపు అన్ని అద్దె భవనాలు లోనే నడుస్తున్నాయని, కొత్తగా భవనాలు నిర్మించడానికి 33స్థలాలను గుర్తించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా అన్ని అర్బన్ ప్రాంతంలో అంగన్వాడీ పేర్మినెంట్ భవనాలు నిర్మాణానికి చొరవ తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ తానేటి వనిత కు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.. వారం రోజులల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణానికి మిగిలిన వాటికీ స్థలాలు సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు.. ఈ సమావేశంలోజిల్లా జాయింట్ కలెక్టర్లు హిమన్ష శుక్ల తేజ్ భరత్ జిల్లా ఉమెన్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయకుమారి,ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు...

Show Full Article
Print Article
Next Story
More Stories