Avanthi Srinivas Comments on Ganta Srinivas Rao: గంటా పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Avanthi Srinivas Comments on Ganta Srinivas Rao: గంటా పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
x
Avanthi Srinivas and Ganta Srinivas rao (File Photo)
Highlights

Avanthi Srinivas Comments on Ganta Srinivas Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు పై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాక్యాలు చేసారు.

Avanthi Srinivas Comments on Ganta Srinivas Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు పై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాక్యాలు చేసారు. గంటా తన పై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే వైసిపి పార్టీ వైపు మెగ్గు చూపుతున్నారు అని.. అధికారం ఎక్కడ ఉంటే, గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారు అని.. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరు. తన పై ఉన్న కేసులు నుండి తప్పించుకోనేందుకు దొడ్డుదారిన వైసిపీలో చేరిందేకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైకిళ్ళు కుంభకోణం, భూ కుంభకోణాల్లో గంటా, గంటా అనుచరులు ఉన్నారు అని.. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశాను అని అంతే కాకుండా ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రే ఫిర్యాదు చేశారు అని మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాక్యాలు చేసారు.

ఇది ఇలా ఉండగా.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారంటూ గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఇటు వైసీపీ కానీ అటు గంటా కానీ ఖండించలేదు. ఇక గంటాను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ బలంగా ఉంది. అన్నీ కుదిరితే ఆగస్టు 15న అధికార పార్టీలో చేరతారని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 15 కాదు.. 9న ఆయన వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు ఆగస్టు 9న వైకాపా కండువా కప్పుకుంటారని ఆ వార్తల సారాంశం.

ఇదిలావుంటే గంటా శ్రీనివాసరావు పార్టీలు మారడం కొత్తేమి కాదు. మొదట టీడీపీ నుంచి తన రాజకీయ భవిశ్యత్ ను ప్రారంభించిన గంటా.. ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గంటా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనంతో ఆ పార్టీ సభ్యుడయ్యారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కు నామరూపాలు లేకుండా పోవడంతో తిరిగి టీడీపీలో చేరారు. మంత్రిగా పనిచేశారు. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యే అయినా టీడీపీ అధికారంలోకి రాలేదు. దాంతో అప్పటినుంచి టీడీపీలో గంటా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories