అల్లు అర్జున్ పై నవంబర్ 6 వరకు చర్యలు వద్దు: ఏపీ హైకోర్టు

అల్లు అర్జున్ పై  నవంబర్ 6 వరకు  చర్యలు  వద్దు: ఏపీ హైకోర్టు
x

అల్లు అర్జున్ పై నవంబర్ 6 వరకు చర్యలు వద్దు: ఏపీ హైకోర్టు

Highlights

సినీ నటులు అల్లు అర్జున్ పై ఈ ఏడాది నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో...


సినీ నటులు అల్లు అర్జున్ పై ఈ ఏడాది నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రవర్తనను ఉల్లంఘించారని అల్లు అర్జున్ తో పాటు రవిచంద్రకిషోర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని అల్లు అర్జున్, రవిచంద్రకిషోర్ రెడ్డిలు ఏపీ హైకోర్టులో ఈ నెల 21 న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించింది. నవంబర్ 6న తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారంపై చర్చ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న సమయంలో ఈ కూటమికి వ్యతిరేకంగా బరిలో ఉన్న వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి శిల్పా రవికి అనుకూలంగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై అప్పట్లో చర్చ జరిగింది. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి శిల్పా రవి ఫ్రెండ్. ఈ కారణంగానే అల్లు అర్జున్ నంద్యాలలో ప్రచారం చేశారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories