YSR Bima Guidelines: పేద‌ల‌కు అండగా వైఎస్సార్ భీమా పథకం .. జ‌గ‌న్ స‌ర్కార్‌ మార్గదర్శకాల జారీ

YSR Bima  Guidelines: పేద‌ల‌కు అండగా వైఎస్సార్ భీమా పథకం ..  జ‌గ‌న్ స‌ర్కార్‌ మార్గదర్శకాల జారీ
x

Andhra Pradesh Govt YSR Bima Rules finalised.

Highlights

YSR Bima Guidelines: కుటుంబ పెద్ద ప్రమాదంలో లేదా సహజ మరణం చెందితే .. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ నూత‌న బీమా ప‌థ‌కాన్ని ప్రారంభించింది. అదే వైఎస్సార్ బీమా ప‌థ‌కం.

YSR Bima Guidelines: కుటుంబ పెద్ద ప్రమాదంలో లేదా సహజ మరణం చెందితే .. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ నూత‌న బీమా ప‌థ‌కాన్ని ప్రారంభించింది. అదే వైఎస్సార్ బీమా ప‌థ‌కం. ఇప్ప‌టికే జ‌గ‌న్ కేబినేట్ ఈ ప‌థ‌కం అమలుకు ఆమోదం తెలిపింది. తాజాగా.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది.

రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ ప‌థ‌కానికి అర్హులుగా నిర్ణయించింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారు ప్రమాదంలో చనిపోయినా లేదా అంగవికులురైనా 5 లక్షల బీమా సౌకర్యం అందించనుంది. 51 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న వారు ప్రమాదంలో చనిపోయినా లేదా అంగవికులురైనా 3 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. 18-50 ఏళ్ల మధ్య వయస్సున్న వారు సహజ మరణం పొందితే 2 లక్షలు బీమా సౌకర్యం ఉంటుంది. రాష్ట్రంలో కోటిన్నర మంది ఈ పథకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇక లబ్దిదారుల గుర్తింపు గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా చేపట్టనున్నారు. ప్రతి లబ్దిదారునికీ ప్రభుత్వం యూనిక్ ఐడీ నెంబర్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వివ‌రాల కోర‌కు ఈ క్రింది నెంబ‌ర్లకు సంప్ర‌దించండి:

శ్రీకాకుళం జిల్లా.. 1800 425 5044, 0894 2279748, 0894 2242600

విజయనగరం జిల్లా.. 1800 425 5043, 9701115588, 0892 2228790

విశాఖపట్నం జిల్లా.. 1800 425 5042, 9989501745, 0891 2518276

తూర్పుగోదావరి జిల్లా.. 1800 425 5041, 0884 2353111, 9849901694

పశ్చిమ గోదావరి జిల్లా.. 1800 425 5040, 0881 2222583, 9701979333

కృష్ణా జిల్లా.. 1800 425 5039, 0866 2412822, 7675917702

గుంటూరు జిల్లా.. 1800 425 5038, 0863 2241326, 9959223557

ప్రకాశం జిల్లా.. 1800 425 5037, 0859 2280598, 0859 2280750

నెల్లూరు జిల్లా.. 1800 425 5036, 9704501172, 0861 2304119

చిత్తూరు జిల్లా.. 1800 425 5035, 08572 242421, 9701501411

అనంతపురం జిల్లా.. 1800 425 5032, 08554 278275, 08554 278285

కడప జిల్లా.. 1800 425 5033, 0856 2255266, 9701789687

కర్నూలు జిల్లా.. 1800 425 5034, 08518 289222, 08518 277770

Show Full Article
Print Article
Next Story
More Stories