వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..

వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..
x
Highlights

YSR Cheyutha Scheme: వైఎస్సార్ చేయూత అమలు చేసేందుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

YSR Cheyutha Scheme: వైఎస్సార్ చేయూత అమలు చేసేందుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మున్సిపాలిటీ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్‌గా మరో 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పటు చేసింది. కమిటీలో ఏడుగురు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు భాగ‌స్వాములు చేసింది ప్ర‌భుత్వం.

ఇక కలెక్టర్ చైర్ పర్సన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. మున్సిప‌ల్ కమిషనర్ ఛైర్ ప‌ర్స‌న్‌గా మరో ఇద్దరు సభులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ అధ్యక్షతన మరో నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ప్రభుత్వం ఏంఓయు చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు కల్పించింది. వారానికి ఒక సారి సమావేశం అవ్వాలని కమిటీలకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్థాయి కమిటీ 15 రోజులకు ఒకసారి భేటీ కానుంది. సెప్టెంబర్ 21లోగా లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించాలని సర్కార్ ఆదేశించింది. వివిధ డిపార్ట్‌మెంట్లను నోడల్ ఏజెన్సీలుగా ప్రభుత్వం పేర్కొంది.



Show Full Article
Print Article
Next Story
More Stories