Nadu-Nedu Programme: మారిపోతున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు

Nadu-Nedu Programme: మారిపోతున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు
x
Highlights

Nadu-Nedu programme: చిత్తూరు జిల్లాలో నాడు నేడు కార్యకమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా ఆధునిక...

Nadu-Nedu programme: చిత్తూరు జిల్లాలో నాడు నేడు కార్యకమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా ఆధునిక హంగుళ్లు సమకూర్చుకుంటున్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కాస్తా నెమ్మదించిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. పాఠశాలు తెరిచేనాటికి సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉంటాయి. ఏపీలో కరోనాతో నాడు నేడు ప్రాజెక్ట్ కు విఘాతం కలిగింది. లేకుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు భవనాలు కార్పొరేట్ స్కూళ్ల బిల్డింగ్ లను తలపించేవి. కరోనా సంక్షోభంలో స్కూళ్లు ఎప్పుడూ తెరిచినా పనులు పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా యంత్రాంగం పట్టుదలగా ఉంది. నాడు నాడు పనులను వేగవంతం చేసింది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 1533 స్కూళ్లు ఉన్నాయి. 1420 స్కూళ్ళలో 350కోట్ల రూపాయలతో మౌళిక వసతులు కల్పిస్తున్నారు. ఆధునిక తరగతి గదులు, కాంపౌండ్ వాల్, బెంచ్ లు, కుర్చీలు రక్షిత మంచినీటి సౌకర్యం, వంటశాల, బాత్ రూములు, టాయిలెట్లు నిర్మిస్తున్నారు. చిత్తూరుతో పాటు ఇతర పట్టణాల్లోని పాఠశాలల్లో నాడు నేడు పనులు 75 శాతం పనులు పూర్తి అయ్యాయి. కరోనా నేపథ్యంలో స్కూళ్లు ప్రారంభానికి కనీసం మరో నెల రోజులు పడనుంది. అప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల పూర్తి సౌకర్యాలతో సిద్ధంగా ఉంటాయి. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారిపోతుండడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories