Industrial Policy 2020: ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

Industrial Policy 2020: ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
x
Highlights

Industrial Policy 2020: నూతన పారిశ్రామిక విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం మంత్రి గౌతమ్‌, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా నూతన పాలసీని...

Industrial Policy 2020: నూతన పారిశ్రామిక విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం మంత్రి గౌతమ్‌, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా నూతన పాలసీని విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతో పాటు వాటికి అందించే మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా వివరించారు.

సులువైన నిబంధనలతో వైఎస్‌ఆర్‌వన్‌ పేరిట కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. నూతన పారిశ్రామికవేత్తలు, నైపుణ్య యువతను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో పారిశ్రామిక విధానం మూడేళ్లకే రూపొందించినట్లు మంత్రి చెప్పారు. కొత్త విధానంతో అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని రోజా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories