Directives on Corona Tests in AP: క‌రోనా టెస్టులకు అనుమతి తప్పనిసరి.. జ‌గ‌న్ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం

Directives on Corona Tests in AP: క‌రోనా టెస్టులకు అనుమతి తప్పనిసరి.. జ‌గ‌న్ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం
x
corona tests
Highlights

Directives on Corona Tests in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం వైర‌స్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతుంది.

Directives on Corona Tests in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం వైర‌స్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్‌ ఆంటీజన్‌ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ల్యాబ్‌ టెస్టుల్లో ఐసీఎంఆర్‌ లాగిన్‌లో డేటాను తప్పకుండా రిజిస్టర్‌ చేయాలని నిర్ణయించింది. కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఎన్‌ఏబీహెచ్‌ దవాఖానలు , ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లు టెస్టుల నిర్వహణకు తప్పనిసరిగా నోడల్‌ ఆఫిసర్‌ అనుమతి ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మరో రికార్డు నెలకొల్పింది. తొలిసారిగా ప్రతి పది లక్షల జనాభాకి సగటున 30,774 మందికి పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దేశ సగటు 11,746గానే ఉంది. గడిచిన 24 గంటల్లో 47,645 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 16,43,319కి చేరింది. కొత్తగా 7,627 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఇదే సమయంలో 3,046 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 46,301కి చేరింది. తాజాగా 56 మంది మృతితో మొత్తం మరణాలు 1,041కి చేరాయి. యాక్టివ్‌ కేసలు 48,956 ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories