AP Govt. New Orders on Covid19 Mask: ఇకనుంచి మాస్క్ తప్పనిసరి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు

AP Govt. New Orders on Covid19 Mask: ఇకనుంచి మాస్క్ తప్పనిసరి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
x
Highlights

AP Govt. New Orders on Covid19 Mask: ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజుల వరకూ రోజు వెయ్యికి లోపే వచ్చిన కరోనా కేసులు.....

AP Govt. New Orders on Covid19 Mask: ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజుల వరకూ రోజు వెయ్యికి లోపే వచ్చిన కరోనా కేసులు.. ఇప్పుడు రెండు వేలు కామన్ అయ్యాయి. అక్కడక్కడా లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నా వైరస్ కేసులు వస్తూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని రకాలుగా నివారణా మార్గాలు తీసుకుంటున్నా.. మహమ్మారి ఎటాక్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచన జారీ చేసింది.

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వ్యక్తులు ఎవరైనా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బహిరంగ ప్రదేశాలలో తిరిగే ప్రజలకు మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పని చేసే ప్రదేశాలు, ప్రయాణ సమయాల్లో మాస్క్‌ను ఖచ్చితంగా ధరించాలని సర్కార్ సూచించింది.

ఒకవేళ ఈ నిబంధన పాటించని వారిపై భారీగా జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కూడా మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. కాగా ఏపీలో కరోనా కేసులు మరోసారి రెండువేలు దాటాయి. శుక్రవారం కొత్తగా 2592 మందికి కరోనా నిర్ధారణ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories