AP Govt Good News to Farmers: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త..

AP Govt Good News to Farmers: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త..
x

YS Jagan (File Photo)

Highlights

AP Govt Good News to Farmers: ఏపీ వ్యవసాయానికి ఉచిత విధ్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

AP Govt Good News to Farmers: ఏపీ వ్యవసాయానికి ఉచిత విధ్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్ల మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు నేరుగా అకౌంటర్లలో జమచేయనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో నేరుగా రైతుల ఖాతాలకు చెల్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లును రైతులే డిస్కంలకు చేలించేలా మార్గదర్శకాలు రూపొందించింది. 2021-2022 ఆర్ధిక ఏడాది నుంచే రైతులు ఖాతాల్లోకి విద్యుత్ నగదు ప్రభుత్వం బదిలీ చేయనుంది.

రాబోయే 30 ఏళ్ల పాటు రైతులపై భారం పడకుండా ఉచిత విద్యుత్‌ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం కోసం రాష్ట్రంలోని సుమారు 18 లక్షల రైతులకు ఏటా 12 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించింది. మరోవైపు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు వీలుగా రూ.1,700 కోట్లతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్నాలు హామీల్లో భాగంగా ఉచిత విద్యుత్తుకు రూ.8,400 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories