AP Government Tenders: మాస్క్ ల పంపిణీ పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం.. టెండర్ల ప్రక్రియ షురూ!

AP Government Tenders: మాస్క్ ల పంపిణీ పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం.. టెండర్ల ప్రక్రియ షురూ!
x
AP Government Tenders on Masks Distribution
Highlights

AP Government Tenders: కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఏపీ ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తిస్థాయిలో పంపిణీ పూర్తిచేయలేకపోయింది.

AP Government Tenders: కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఏపీ ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తిస్థాయిలో పంపిణీ పూర్తిచేయలేకపోయింది. అప్పట్లో వీటికి అవసరమైన క్లాత్ ఆప్కో వద్ద లేకపోవడంతో ప్రస్తుతం ప్రైవేటు వర్తకుల వద్ద నుంచైనా కొనుగోలు చేసి,పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో సెర్ప్ దానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. దీనికి సంబందించి ఇప్పటికే టెండర్ల ప్ర్రకియ పూర్తికాగా, మరికొద్ది రోజుల్లో వీటిని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

రాష్ట్రంలో ఇంకా మాస్కులు అందని ప్రతి ఒక్కరికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 33 లక్షల మీటర్ల క్లాత్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర జనాభా 4,87,54,176 మంది కాగా ఇప్పటికే 3,70,13,300 మందికి మూడేసి చొప్పున 11.10 కోట్ల మాస్కులను ప్రభుత్వం పంపిణీ చేసింది. మాస్కుల తయారీకి అవసరమైన క్లాత్‌ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో నుంచి అధికారులు కొనుగోలు చేశారు. అయితే.. 1.30 కోట్ల మీటర్ల క్లాత్‌ను సరఫరా చేశాక నిల్వలు తరిగిపోవడంతో ఆ సంస్థ సరఫరా నిలిపివేసింది. దీంతో మాస్కుల పంపిణీ పలుచోట్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి రాగానే ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద నుంచి అయినా క్లాత్‌ కొనుగోలు చేసి.. మిగిలిపోయిన వారికి కూడా మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు క్లాత్‌ కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టెండర్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

► ఇంకా మాస్కులు అందని 1,17,40,876 మందికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు 33 లక్షల మీటర్ల క్లాత్‌ అవసరమని అధికారులు నిర్ధారించారు.

► టెండర్‌ ప్రక్రియలో ఆప్కోకు చెల్లించిన ధర కంటే దాదాపు 30–35 శాతం తక్కువ ధరకే క్లాత్‌ సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు.

► విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అందరికీ మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ పూర్తయిందని.. మిగిలిన జిల్లాల్లో మూడొంతులు పూర్తయిందని చెప్పారు.

► మాస్కులు కుట్టే పనిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఒక్కొక్క మాస్కు సింగిల్‌ లేయర్‌తో కుడితే రూ. 3 చొప్పున.. డబుల్‌ లేయర్‌తో కుడితే రూ.3.50 చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు.

► పొదుపు సంఘాల మహిళలు మాస్కులు తయారుచేశాక వాటిని సెర్ప్, మెప్మా సిబ్బంది సేకరించి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు అప్పగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories