YS Jagan on Electricity to Farmers: మీటర్లు ఉంటే నాణ్యమైన విద్యుత్తు.. ఏపీ సిఎం జగన్!

YS Jagan on Electricity to Farmers: మీటర్లు ఉంటే నాణ్యమైన విద్యుత్తు.. ఏపీ సిఎం జగన్!
x
Highlights

YS Jagan on Electricity to Farmers |రైతులకు విద్యుత్ బిల్లు సమస్య ఉండదని సీఎం జగన్ స్పష్టం చేసారు.

YS Jagan on Electricity to Farmers |రైతులకు విద్యుత్ బిల్లు సమస్య ఉండదని సీఎం జగన్ స్పష్టం చేసారు. రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు, రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలన్న జగన్.. మీటర్ల ద్వారా ఫీడర్లపై భారం ఎంతో తెలుస్తుందని వివరించారు. ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలలో డబ్బు జమచేస్తుందన్నారు. మరో పక్క జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్ పై ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాదు, గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) వద్ద మౌలిక సౌకర్యాల కల్పనపై వైఎస్ జగన్ మాట్లాడారు.

ఆర్‌బీకేల పక్కన సుమారు రూ.6వేల కోట్లతో 13 రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా సిఎం జగన్ తెలిపారు. గోదాములు, పంట ఉత్పత్తుల్ని ఎండబెట్టే కల్లాలు (ప్లాట్‌ఫాం), శీతల గదులు, అద్దె యంత్రాల సరఫరా, సేకరణ కేంద్రాలు, నతా బజార్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ప్రాథమిక ఆహారశుద్ధి కేంద్రాలుతోపాటు కొన్ని గ్రామాల్లో ఆక్వా, పశువులకు సంబంధించిన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.

ఈ-మార్కెటింగ్‌పై దృష్టి సాదించండి..

అధికారులకు ఈ-మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంపై దృష్టి సాదించాలని జగన్ ఆదేశించారు. రైతులకు పాల ధర పెంచినంత మాత్రాన ప్రయోజనం కలగదు. దానికి అనుబంధంగా చాలా చేయాలనే అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. వెబ్‌ల్యాండ్‌ పేరుతో గత ప్రభుత్వం 2016లో పలు చోట్ల భూదస్త్రాలను తారుమారు చేశారని.. వ్యవసాయ శాఖ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ అంశంపై స్పందించిన జగన్ వచ్చే వారం జరిగే స్పందన సమీక్ష ఎజెండాలో చేర్చాలని ఈ సందర్భంగా సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories