ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనది : సీఎం వై.ఎస్.జగన్

ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనది : సీఎం వై.ఎస్.జగన్
x
YS Jagan
Highlights

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని, అయితే ఆయన మరణించిన తర్వాత ఆ రెండూ పేదవాడికి దూరమయ్యాయని అన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చినట్టు చెప్పారు. ఆరోగ్య శ్రీ, 104.. 108ల వాహనాల ఆధునికీకరణపై కూడా ఆయన చర్చించారు. కాగా మరికొద్దిరోజుల్లో 108 సంబంధించి నూతన వాహనాలు రానున్నాయి.

రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పరిధిని వర్తింపజేశాం. అని.. దీంతో మొత్తం 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. జులై 8 నుంచి 6 జిల్లాలో అమలు చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత నవంబర్‌ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే క్యాన్సర్‌ ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామన్నారు ముఖ్యమంత్రి.. మాటలు రానివారికి ఏర్పాటు చేసే స్పీచ్‌ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల కోసం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories