AP CM YS Jagan: కరోనా రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదు..

AP CM YS Jagan: కరోనా రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదు..
x

YS Jagan (File Photo)

Highlights

AP CM YS Jagan: కరోనా చికిత్స తీసుకుంటున్న వారికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

AP CM YS Jagan: కరోనా చికిత్స తీసుకుంటున్న వారికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా రోగులకు మంచి వైద్యం, భోజనం అందించాలన్న అయన.. సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నవారికి సక్రమంగా సేవలు అందించాలన్నారు. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలకు ఎప్పటికి అప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే వారికి అత్యుత్తమ సేవలు అందించాలన్నారు.

ఇక కరోనా కేసులు చుస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,393 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,551 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,393 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన ౨౪ గంటల్లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లా 16, ప్రకాశం జిల్లా 11, నెల్లూరు జిల్లా 09, అనంతపురం జిల్లా 08, తూర్పు గోదావరి జిల్లా 08, పశ్చిమ గోదావరి జిల్లా 08, కడప జిల్లాలో 07, గుంటూరు జిల్లా 06, విశాఖపట్నం జిల్లా 06, కర్నూలు జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 06, విజయనగరం జిల్లా 03, కృష్ణ జిల్లా 03, కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,25,396. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,906. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా 45,356 కర్నూల్ జిల్లా 36, 381 అనంతపురం జిల్లా 32, 603 కేసులు నమోదు.

ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,35,218 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 87,177 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 55,551 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 30,74,847 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories