AP Caninet to Meet Today: నేడే ఏపీ కేబినెట్.. కొత్త జిల్లాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చర్చ

AP Caninet to Meet Today: నేడే ఏపీ కేబినెట్.. కొత్త జిల్లాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చర్చ
x
AP Cabinet Meeting (File Photo)
Highlights

AP Caninet to Meet Today: ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది.

AP Caninet to Meet Today: ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలతో పాటు గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల‌పై చ‌ర్చ జోరందుకుంది. నేడు జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ స‌మావేశంలో ఈ అంశంపై ముంద‌డుగు ప‌డే సూచన‌లు క‌నిపిస్తున్నాయి. మొత్తం 20 అంశాల‌పై కేబినెట్ చ‌ర్చించ‌నుండ‌గా..కొత్త జిల్లాల ఏర్పాటుపైనే ఫోక‌స్ ఎక్కువ క‌నిపిస్తోంది.

జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జ‌గ‌న్ స‌ర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స‌మాచారం. కేబినెట్ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రజంట్ ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా వ‌ర్గీక‌రించ‌నున్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా గ‌వ‌ర్న‌మెంట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ అంశంపై అధ్య‌య‌నం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ఇసుక‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాల దిశగా ఏపీ స‌ర్కార్ ముంద‌డుగు వేస్తోంది. ఇసుక కొరత తీర్చేందుకు ఉప‌క‌రించే చర్యలతోపాటు.. అక్రమాలకు తావు లేకుండా మరో కీలక నిర్ణయం తీసుకోనే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇసుక అక్రమాలను నియంత్రించేందుకు ఇప్పటికే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మ‌రో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఇసుక సంబంధించి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా శాండ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఏర్పాటుకు కెబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది. రాజధానుల ఏర్పాటు.. తరలింపు అంశంతోపాటు.. కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల పైనా కేబినెట్ భేటీలో చ‌ర్చించ‌నున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories