AP Assembly: నేటితో ముగియనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh Assembly Session to End Today
x

AP Assembly: నేటితో ముగియనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

Highlights

AP Assembly: బడ్జెట్‌పై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న మంత్రి బుగ్గన

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 5న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగా.. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి సభ ధన్యవాదాలు తెలిపింది. ఈ నెల 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. నేడు బడ్జెట్‌కు అసంబ్లీ ఆమోదం తెలపనుంది. బడ్జెట్‌పై అసెంబ్లీలో మంత్రి బుగ్గన సమాదానాలు ఇవ్వనున్నారు. బడ్జెట్‌తో పాటు మరో రెండు బిల్లులకు సైతం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు సభాపతి.

Show Full Article
Print Article
Next Story
More Stories