Andhra Pradesh-Telangana Border: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి షాక్.. కొత్త నిబంధనలు ఫాలో కావాల్సిందే

Andhra Pradesh-Telangana Border: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి షాక్.. కొత్త నిబంధనలు ఫాలో కావాల్సిందే
x
Highlights

Andhra Pradesh-Telangana Border: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవారికి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.

Andhra Pradesh-Telangana Border: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవారికి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా చెక్ పోస్ట్ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే చెక్ పోస్ట్ దగ్గర అనుమతిస్తారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్గొండ జిల్లా మీదుగా వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రా బోర్డర్ లో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. దీంతో ప్రయాణికులు అందుకు అనుగుణంగా ప్రయాణించాలని నల్గొండ ఎస్పీ రంగనాథ్ అంటున్నారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దని నల్గొండ ఎస్పీ పేర్కొన్నారు.

మరోవైపు నల్లగొండ జిల్లా మీదుగా ఏపీ వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ - మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే వారికి విధిగా అధికారులు జారీ చేసిన పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణించే వారనీ ఏపీకి అనుమతించడం లేదని ప్రయాణికులకు సూచన చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు తీసుకోవాలని.. స్పందన యాప్ లో ద్వారా పాసులు తీసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories