Krishnapatnam: ఆనందయ్య కరోనా మందు పరిశీలనకు వైద్యుల బృందం

Anandayya Herbal medicine
x

ఆనంద‌య్య‌ ఫైల్ Photo

Highlights

Krishnapatnam: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్‌ శాఖ, ఐసీఎంఆర్‌ పరిశోధనలు చేస్తున్నాయి.

Krishnapatnam: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్‌ శాఖ, ఐసీఎంఆర్‌ పరిశోధనలు చేస్తున్నాయి. కృష్ణపట్నంలోని ఆనందయ్య కరోనా మందును స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర ఆయుర్వేదిక్‌ పరిశోధనా సంస్థ వైద్యులు సిద్ధమయ్యారు. వైద్యుల బృందం కృష్ణపట్నంలో సోమవారం పర్యటించనుంది. స్వయంగా మందును పరిశీలించి అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కరోనా మందును పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది.

మరోవైపు, ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుపై పూర్తి నమ్మకం ఉందని గ్రామస్థులు మరోసారి స్పష్టంచేశారు. తమ గ్రామంలో కరోనా లేదని, ఆనందయ్య మందువల్లే సాధ్యమైందని చెబుతున్నారు. సక్రమంగా వాడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. శాస్త్రీయంగా ఆమోద ముద్ర లభించేవరకూ ఓపిక పట్టాలని జన విజ్ఞానవేదిక, ప్రజా ఆరోగ్య వేదిక సూచిస్తున్నాయి.ఈ మందుపై శాస్త్రీయ నిర్ధారణ కోసం కేంద్ర ఆయుర్వేదిక్‌ పరిశోధనా సంస్థ వైద్యులు సోమవారం కృష్ణపట్నం వస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రజలందరికీ పంపిణీ చేస్తామని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories