ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. బుధవారం సచివాలయంలో ఈ బేటీలో...
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. బుధవారం సచివాలయంలో ఈ బేటీలో మంత్రివర్గం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అంతే కాకుండా ఈ కేబినెట్ భేటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంపైన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన చర్చ జరిగింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం!
2700 నుంచి 2200 ఎకరాలకు ఎయిర్‌పోర్టు కుదింపు
బోగాపురం ఎయిర్‌పోర్టులో లో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి
కుదింపు స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం
రూ. 3కోట్లు ధర వేసుకున్నా... ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం
తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు
విద్యార్థుల తల్లుల చేతికే ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు
జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బును నేరుగా తల్లుల అక్కౌంట్లోకి
ప్రతి త్రైమాసికం పూర్తికాగానే ఫీజురియంబర్స్‌మెంట్ డబ్బును తల్లుల ఖాతాల్లోకి
నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్
రైతులకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్
10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం
కర్నూలు జిల్లా పిన్నాపురంలో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ.2.5 లక్షలు. రాగా ప్రస్తుతం అదే సంస్థ, అదే ప్రాజెక్టు ఎకరాకు రెట్టింపు చెల్లించడానికి సిద్ధం అయింది. అందులో భాగంగానే ఎకరాకు రూ. 5లక్షలు చొప్పున ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఇది కాక ప్రతి మెగావాట్‌కు ప్రతి ఏటా గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జ్ కింద లక్ష రూపాయలు చెల్లింపునకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఏడాదికి రూ.32కోట్లు ఆదాయం రానుంది. 25 ఏళ్ల తర్వాత ప్రతి మెగావాట్‌కు 2 లక్షల రూపాయలు చెల్లింపునకు అంగీకారం తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా 550 మెగావాట్లు విండ్ పవర్, 1200 మెగావాట్ల హైడ్రో, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయనుంది.
నవరత్నాలు అమల్లో భాగంగా వైఎస్సార్ చేయూత
వైఎస్సార్ చేయూత పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేల ఆర్థిక సహాయం
ఏడాదికి రూ. 18,142,81ల చొప్పున నాలుగేళ్ళ పాటు ఆర్థిక సహాయం
అగస్టు 12న ఈ పథకం అమలు
ఈ పథకానికి 24 నుంచి 26 లక్షలమంది లబ్ధిదారులు
'జగనన్న తోడు'
చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు
రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాలు
చిరువ్యాపారులు, తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు ఈ పథకం
9 లక్షలమందికిపైగా లబ్ధిదారులు
వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్
తల్లులు, చిన్నారుల అదనపు పౌష్టికాహారం
77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల వైఎస్సార్ సంపూర్ణ పోషణ
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
ఈ ఏడాది గర్భవతులు, తల్లులు, పిల్లల పౌష్టికాహారం కోసం 1863.11 కోట్ల రూపాయలు
2018–19లో రూ. 762 కోట్లు ఖర్చు
2019–20లో రూ. 1076 కోట్లు ఖర్చు
ఐదేళ్ల పాటు నివాసం ఉన్న తర్వాతే..
ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు
హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం
ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునేలా నిబంధనలు
ఏపీ అవుట్ సోర్సింగ్ సర్వీస్‌కార్పొరేషన్ కోసం 55 పోస్టులను భర్తీచేసేందుకు కేబినెట్ ఆమోదం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మొత్తం నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
దళారీలు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో అవినీతి లేకుండా చర్యలు.
కమీషన్లు లేకుండా నేరుగా బ్యాంకుఖాతాలకే సకాలానికి జీతాలు
ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి బెనిఫిట్స్ అందించేలా చూడ్డానికే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు.
రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం
రూ.200 కోట్ల నిధులు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం, రూ.2079 కోట్ల మేర రుణాలు.
ఫేజ్ –1 కింద 36 నెలల్లో రూ. 3,736 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక, 802 ఎకరాల్లో తొలిదశ
గ్రేహౌండ్స్ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపు
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
బిల్డ్ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాల అమ్మకానికి కేబినెట్ ఓకే
విశాఖపట్నంలో 7, గుంటూరులో 4 స్థలాల విక్రయానికి అంగీకరించిన కేబినెట్
గుంటూరులో 1, విశాఖలో 3 చోట్ల గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ ద్వారా అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం
ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదమద్ర
ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీకింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం
తిరుపతిలో ఏర్పాటుకు సూత్రప్రాయ నిర్ణయం
విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
జేఎన్‌టీయూ కాకినాడ కింద ఏర్పాటు రూ. 153.853 కోట్ల ఖర్చు
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి రూ. 405 కోట్ల ఆదా
12.6 శాతం లెస్‌తో రూ. 2811కోట్లకు బిడ్ దక్కించుకున్న మెగా సంస్థ
కాంట్రాక్టు అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఫైల్ చేయడానికి కేబినెట్ ఓకే
పోలవరం హైడ్రోప్రాజెక్టు ఐబీఎం వాల్యూ రూ.3,216 కోట్లు.
గండికోట నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం
మొత్తంగా రూ. 1411.56 కోట్లు
వెలిగొండ ప్రాజక్టులో ఆర్ అండ్ ఆర్‌కు రూ. 1301.56 కోట్లు
తీగలేరు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ భూసేకరణకోసం రూ.110 కోట్లు
వీటి అమలుకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌కు 55 పోస్టులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire