Alla Nani: కొవిడ్ రోగుల‌ నుంచి అధికంగా వసూలు చేస్తే సహించేదిలేదు

Alla nani warna to Covid Hosptials
x

ఆళ్ల‌నాని ఫైల్ ఫోటో 

Highlights

Alla Nani: కోవిడ్ హాస్పిటల్స్ లోపెషేంట్స్ నుంచి అడ్డగోలు వసూళ్లు పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్

Alla Nani: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కోవిడ్ హాస్పిటల్స్ లోపెషేంట్స్ నుంచి అడ్డగోలు వసూళ్లు పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఆరోగ్య శ్రీ పెషేంట్స్ నుంచి లక్షలు వసూళ్లు చేస్తున్న ప్రవేట్ హాస్పిటల్స్ పై కఠినంగా వ్యవహారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.ఆరోగ్య శ్రీ కార్డ్స్ ఉన్న అడ్వాన్స్ పేమెంట్స్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని అదేశించారు.

కోవిడ్ పెషేంట్స్ నిలువు దోపిడీ పై మీడియా లో వస్తున్న వరస కధనలపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఆళ్ల నాని..ఆరోగ్య శ్రీ పేరుతో పెషేంట్స్ నుండి లక్షలు గుంజుతున్న హాస్పిటల్స్ పై ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీమ్ వేసి తనిఖీలు నిర్వహించాలని DMHO డాక్టర్ సునంద ను అదేశించించారు.జిల్లా వ్యాప్తంగా కోవిడ్ ప్రవేట్ హాస్పిటల్స్ విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి ఆళ్ల నాని అన్నారు.

ప్రవేట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులకు కూడ వెనుకడవద్దని సూచించారు. ఆరోగ్య శ్రీ కింద అందించే సేవలకు పెంచిన ఫీజులనే ప్రభుత్వం చెల్లిస్తుందని..ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కంటే అధికంగా వసూలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.ప్రవేట్ హాస్పిటల్స్ లో అధిక రేట్లు నియంత్రణ, నిబంధనలు ఖచ్చితంగా అమలు కావాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించారు.

ప్రతి కోవిడ్ ప్రవేట్ హాస్పిటల్స్ లో సీసీ కెమెరా లు, ఆరోగ్య మిత్రలు సమర్ధవంతంగా పని చేయడానికి అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని మంత్రి తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మానవత్వంతో ప్రవేట్ హాస్పిటల్స్ వ్యవహారించాలి...ప్రతి పేద వాడికి, ప్రతి రోగికి ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందాచాలే త‌ప్ప ఎక్కువగా ఫీజులు వసూలు చేసే ప్రవేట్ కోవిడ్ హాస్పిటల్స్ పై కఠిన చర్యలకు వెనుకాడ వద్దని మంత్రి తెలిపారు.

ఎంప్యానల్ చేసిన ప్రవేట్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా 50%బెడ్స్ ఆరోగ్య శ్రీ పెషేంట్స్ కు ఇవ్వాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని DMHO డాక్టర్ సునందను మంత్రి ఆళ్ల నాని చెప్పారు. అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బెడ్స్ కొరత ఉన్నట్టు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితిలో సహించేదిలేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడ RMP వైద్యులు ప్రవేట్ హాస్పిటల్స్ కు కోవిడ్ పెషేంట్స్ ను పంపి కమిషన్ వసూలు చేస్తున్నట్టు వస్తున్న వాటిపై కూడ నిఘా పెట్టాల‌ని చెప్పారు.

ప్రభుత్వం నిర్ధారణ చేసిన ధరలకు అనుగుణంగా ప్రవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఫీజులు వసూలు చేయకుండా ఉంటే అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలి...రెమిడీసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ లో విక్రయాలు చేస్తే ఎవరిని వదిలేది లేదని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి కూడ ఆo పో టేరిసిన్ బి ఇంజక్షన్స్ తో పాటు, కేంద్రం ఇచ్చిన పొసకొనజోల్ ఇంజక్షన్స్ కూడ అందుబాటులో ఉండాలని..కోవిడ్ పెషేంట్స్ నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తుంటే పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కూడ చర్యలు ఉంటాయని మంత్రి స్పంష్టం చేశారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే 104కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories