Pawan Kalyan: కుంకీ ఏనుగులు ఏపీకి తరలింపు.. కర్ణాటకతో కీలక ఒప్పందం

Agreement Between Ap And Karnataka On Six Issues Says Deputy CM Pawan Kalyan
x

Pawan Kalyan: కుంకీ ఏనుగులు ఏపీకి తరలింపు.. కర్ణాటకతో కీలక ఒప్పందం

Highlights

Pawan Kalyan: రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో లే

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు చేసుకున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పవన్ కల్యాణ్‌తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏనుగుల సంచారంపై చర్చించారు.

ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. మావటి, కావటీలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వారిలో సామర్ధ్యాన్ని పెంచామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో ఏనుగుల బీభత్సాన్ని అరికట్టేందుకు దసరా తర్వాత కుంకి ఏనుగులు పంపించేందుకు కర్ణాటక అంగీకరించినట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య జరగలేదన్నారు. శ్రీకాకుళం, మన్యం, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఏనుగుల దాడులు చేస్తూ మనుషుల ప్రాణనష్టం, పంట నష్టం జరుగుతుందని తెలపారు.

కుంకీ ఏనగుల వల్ల దాడులను అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఏపీ, కర్ణాటక సంయుక్తంగా అరికట్టేందుకు ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూలకు సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు, అధికారులకు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories