ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర

Nimmagadda Ramesh kadapa Tour
x

ఫైల్ ఇమేజ్

Highlights

* ఈ నెల 9న ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు * కడప జిల్లాలో మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన * ఎన్నికల ముందు రోజు పర్యటనతో అందరిలో ఉత్కంఠ

ఏపీలో తొలివిడత పంచాయతీ పోరుకు సర్వత్రా సిద్ధం అయింది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దాంతో ఎన్నికల నిర్వహణలో అధికారులు ఉన్నారు. అయితే ఇవాళ, రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. ఎన్నికల సరళిని దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఎన్నికల అధికారులతో ఎప్పకప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ బీజీగా గడుపుతున్నారు. ఇవాళ కడప జిల్లాలో మరోసారి పర్యటించనున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఎన్నికల ముందు రోజు కడపలో పర్యటించడం అందరిలో ఉత్కంఠగా మారింది.

కడప జిల్లాలో పంచాయతీ పోరు రక్తికట్టిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మధ్య వార్ లా మారిన ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ వ్యూహ రచనల్లో ఉంది. అయితే ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ భరోసాతో ప్రతిపక్ష టీడీపీ కూడా తన సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి పర్యటించిన ఎస్ఈసీ ఇప్పుడు ఎన్నికలకు ఒకరోజు ముందు కడప జిల్లాలో పర్యటించడం ఆసక్తిగా మారింది.

కడప జిల్లాలో తొలి విడతలో 206 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 51 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 155 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకోసం నిమ్మగడ్డ అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు మరోసారి కడప జిల్లాకు వచ్చారు. జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొదటి పర్యటన ప్రతిపక్ష పార్టీలో మనోధైర్యాన్ని నింపితే ఈ పర్యటనలో ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగానికి ఎలాంటి దిశానిర్ధేశనం చేస్తారన్నది కూడా ఎవరికి అంతుబట్టడం లేదు. మొత్తం మీద సిఎం జిల్లాలో రెండవ సారి నిమ్మగడ్డ పర్యటన ఆసక్తిగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories