Sonu Sood Help to Chittoor Farmer: కరోనా లాక్ డౌన్ సమయం నుండి వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట నటుడు సోను సూద్ దేవుడుగా నిలిచాడు
Sonu Sood Help to Chittoor Farmer: కరోనా లాక్ డౌన్ సమయం నుండి వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట నటుడు సోను సూద్ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. కార్మికులు కాలి నడకన వెళ్లకుండా వారికి భోజనం ఏర్పాటు చేసి, వారికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ ఇంటికి చేర్చాడు. దీనితో ఎక్కడ చూసినా సోనూసూద్ పేరు మారుమ్రోగింది. అయితే ఇలా సేవలకి సోనూసూద్ ఎక్కడ కూడా బ్రేక్ వేయడం లేదు.. కష్టం ఎక్కడుంటే అక్కడ సోనూసూద్ ఉంటున్నాడు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు. తండ్రి కష్టాన్ని చూసి తట్టుకోలేక కుమార్తెలే కాడెద్దులుగా మారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి చలించిపోయిన సోనూసుద్ సదరు రైతుకు ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు మహల్ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనితో ముందుగా సోనూసూద్ రేపు ఉదయానికల్లా ఎద్దులు కొనిస్తానని అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఎద్దులు కాదు ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే కొద్ది గంటల్లోనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్ ని బుక్ చేశాడు. దీంతో షోరూమ్ వాళ్ళు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు.
This family doesn't deserve a pair of ox 🐂..
— sonu sood (@SonuSood) July 26, 2020
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD
సోనూసూద్ చేసిన సహాయానికి వారు సదరు రైతు కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఇక సదరు రైతును చదువులపై దృష్టి సారించాలని సోనుసూద్ కోరాడు. ఒక దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ 'సోనూది గొప్ప మనసు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire