Acham Naidu: అచ్చెన్నాయుడును ఎన్నారైకు తరలింపు.. పాజిటివ్ నేపథ్యంలో అధికారుల నిర్ణయం

Acham Naidu: అచ్చెన్నాయుడును ఎన్నారైకు తరలింపు.. పాజిటివ్ నేపథ్యంలో అధికారుల నిర్ణయం
x

Acham naidu

Highlights

Acham Naidu: ఈఎస్ఐ స్కాంలో నింధితుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు.

Acham Naidu: ఈఎస్ఐ స్కాంలో నింధితుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. వైద్యం నిమిత్తం శనివారం సాయంత్రం ఈయన్ను తరలిస్తూఅధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ రావడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు.

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్‌ సెంటర్‌లో చూపించిన కాల్స్‌ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories