మదనపల్లె జంట హత్యల కేసు: ఆస్పత్రి నుంచి పద్మజ, పురుషోత్తం డిశ్చార్జ్

Accused in Madanapalle Twin Murder Case Discharged From Hospital
x

మదనపల్లె కేసు పురుషోత్తం, పద్మజ  (ఫైల్ ఫోటో)

Highlights

Madaapalle Murder Case: జంట హత్యల కేసులో మానసిన వైద్యశాలలో చికిత్స పొందుతున్న నిందితులు డిశార్జ్ అయినట్లు తెలుస్తోంది.

Madanpalle Murder Case: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసులో నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలు విశాఖ మానసిక వైద్య‌శాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిందితులను చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లేందుకు మదనపల్లె పోలీసుల అక్కడికి చేరుకున్నారు. ఒక ఎస్ఐ ఐదుగురు పోలీసులు ఎస్కార్ట్ వెహికల్ తో వచ్చారు. సోమవారం మదనపల్లె పోలీసులకు వైద్యులు అప్పగించనున్నారు.

పురుషోత్తం నాయుడు పద్మజలు పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పురుషోత్తమ నాయుడు పద్మజ దంపతులను జనవరి 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య సాయిదివ్యను హత్య చేశారు. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు కేకలతో ఖైదీలు భయపడిపోయారు.

మదనపల్లె సబ్ జైలులో ఉన్న పద్మజ దెబ్బకు జైల్లో ఖైదీలు వణికిపోయారు. శివుడు వస్తున్నాడు కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు. పద్మజ ఉంటున్న బ్యారక్ లో మహిళా ఖైదీలు రాత్రిళ్లు నిద్రించాలంటే భయపడ్డారు. పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు.

పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి ఏడ్చారు. దీంతో జైలు సిబ్బంది అధికారులతో మాట్లాడి తిరుపతి రుయాకు తరలించగా మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్ చేశారు. నిందితులు పురుషోత్తం పద్మజలను విశాఖ తరలించారు. ఇద్దర్ని విశాఖ మానసిక చికిత్సాలయంలో చేర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories