ACB Rides: 16మంది సిబ్బందిపై వేటు

ACB Rides in Vijayawada Kanakadurga Temple
x

విజయవాడ కనకదుర్గ దేవస్థానం (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

ACB Rides: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో 5 రోజులపాటు కొనసాగిన ఏసీబీ తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిశాయి.

ACB Rides: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో 5 రోజులపాటు కొనసాగిన ఏసీబీ తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిశాయి. ఈ దాడుల్లో ఆలయంలోని కీలకమైన విభాగాలన్నింటినీ ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొండపై జరుగుతున్న అనేక లోపాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేశారు.

ఈ రిపోర్ట్ ఆధారంగా 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌ పి.అర్జునరావు ఆదేశాలు విడుదల చేశారు. కనకదుర్గగుడి ఈవో సురేష్‌బాబుతో పాటు 6గురు సూపరింటెండెంట్‌లు, 9 మంది గుమాస్తాలపై వేటు పడింది. వీరిలో చీరలు, ప్రసాదాలు, అన్నదానం, స్టోర్‌ తదితర 8 విభాగాలకు చెందిన వారు ఉన్నారు. దేవాలయంలోని లడ్డూ ప్రసాదాలు, టికెట్లు‌, చీరల కౌంటర్లు, టోల్‌గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రాడ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు రిపోర్ట్ లో వెల్లడించారు.

వేటు పడిన వారు:

  1. కె.శ్రీనివాసరావు - సూపరింటెండెంట్‌
  2. కె.శ్రీనివాసమూర్తి - సూపరింటెండెంట్
  3. ఎ.అమృతరావు - సూపరింటెండెంట్‌
  4. పి. భాగ్యజ్యోతి - సూపరింటెండెంట్‌
  5. కె.హరికృష్ణ - సూపరింటెండెంట్‌
  6. కూరెళ్ల శ్రీనివాసరావు - సూపరింటెండెంట్‌
  7. బి.నాగేశ్వరరావు - సీనియర్‌ అసిస్టెంట్‌
  8. జి.యశ్వంత్‌ - సీనియర్‌ అసిస్టెంట్‌
  9. ఎం.ఎస్‌.ప్రకాశరావు - జూనియర్‌ అసిస్టెంట్
  10. సీహెచ్‌.చెన్నకేశవరావు - జూనియర్‌ అసిస్టెంట్‌
  11. కె.రమేష్‌ - రికార్డు అసిస్టెంట్‌
  12. పి.రాంబాబు - రికార్డు అసిస్టెంట్‌
  13. పి.రవికుమార్ ‌-రికార్డు అసిస్టెంట్‌
  14. రవిప్రసాద్‌ - సూపరింటెండెంట్‌
  15. పద్మావతి - సీనియర్‌ అసిస్టెంట్‌
  16. జె.ఏడుకొండలు - అటెండర్
Show Full Article
Print Article
Next Story
More Stories