AP News: ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రద్దు

Abolition of AP Special Enforcement Bureau
x

AP News: ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రద్దు

Highlights

AP News: సెబ్‌ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP News: ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో 'సెబ్‌' ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు జారీచేశారు. సెబ్‌ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీచేసిన 12 జీవోలు రద్దు చేశారు. ఎక్సైజ్‌శాఖలోని 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని సెబ్‌కు కేటాయించింది గత ప్రభుత్వం. వారందరినీ రిలీవ్ చేసి, ఎక్సైజ్‌శాఖలో రిపోర్ట్‌ చేయాలని డీజీపీ ఆదేశించారు.

సెబ్‌ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. సెబ్‌కు చెందిన ఫర్నిచర్‌, వాహనాలు, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్‌శాఖకు అప్పగించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఇన్నాళ్లూ ఎక్సైజ్‌శాఖకు అనుబంధంగా సెబ్ పనిచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories