Snake Dance: ఇంట్లో కొండచిలువను పెంచుతన్నయువకుడు

A young man raising python at home
x

ఫైల్ ఇమేజ్


Highlights

Snake Dance: డ్యాన్స్‌ షో కోసం ఓ యువకుడు ఏకంగా కొండచిలువను పెంచుకోవడం కలకలం రేపింది.

పశ్చిమగోదావరి: సాధారణంగా మనం ఇళ్లలో కుక్కలు, కోళ్లు, పిట్టలను పెంచుకోవడం చూస్తున్నాము. మరి కొంతమంది పాములను పెంచుకుంటూ వుంటారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఏకంగా కొండ చిలును పెంచుకుంటున్నాడట. వివరాల్లోకి వెళితే... డ్యాన్స్‌ షో కోసం ఓ యువకుడు ఏకంగా కొండచిలువను పెంచుకోవడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం లక్ష్మీనగర్‌లోని నాగిరెడ్డి అనే వ్యక్తి భగవాన్‌ కొబ్రా డ్యాన్స్‌ గ్రూపు నిర్వహిస్తుంటాడు. నిజమైన పాముతో స్నేక్‌ డ్యాన్స్‌ చేసేందుకు దీనిని తీసుకుని వచ్చి పెంచుతున్నాడు. పరిసరాల్లోని పిల్లలు ఆడుకుంటున్న సమయంలో బంతి భగవాన్‌ ఇంటి బాత్రూమ్‌లో పడింది. తెచ్చుకునేందుకు వెళ్లిన పిల్లలకు అక్కడ పాము కనిపించడంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అటవీశాఖ అధికారులతో వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది నెలల వయసు.. 11 అడుగుల పొడవు.. 45 కిలోల బరువున్న దీనిని నల్లజర్లలోని అటవీ శాఖాధికారులకు అప్పగించినట్టు పట్టణ ఎస్‌ఐ ఫజల్‌ రహ్మన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories