Kurnool: మేక కోసం వెళ్లి రాళ్లలో ఇరుక్కున్న యువకుడు

A Young Man Goes For A Goat And Gets Stuck In The Rocks
x

Kurnool: మేక కోసం వెళ్లి రాళ్లలో ఇరుక్కున్న యువకుడు

Highlights

Kurnool: తాళ్ల సాయంతో యువకుడిని సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు

Kurnool: కర్నూలు మండలం చెన్నంపల్లి గ్రామంలో ఓ యువకుడు బండరాళ్ల మధ్య ఇరుక్కున్నాడు. మేకలు కాచేందుకు వెళ్లిన యువకుడు రాజేష్.. సోమవారం సాయంత్రం తన మేక కనిపించడం లేదని వెదికాడు. అయినా కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్య ఇరుక్కుందేమో అన్న అనుమానంతో రాళ్ల మధ్యలోకి వెళ్లాడు. దాంతో ఆ యువకుడు రాళ్ల మధ్యే ఇరుక్కున్నాడు. బయటకు వచ్చేందుకు వీలు కాక కాసేపు అల్లాడిన యువకుడు.. తన దగ్గర ఉన్న ఫోన్‌తో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు వెళ్లిన స్థానికులు తాళ్ల సాయంతో యువకుడిని బయటకు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories