Chittoor: ప్రభుత్వ ఆస్పత్రిలో బాత్రూంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

A Woman Gave Birth To A Baby Girl In The Bathroom Of A Government Hospital
x

Chittoor: ప్రభుత్వ ఆస్పత్రిలో బాత్రూంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Highlights

Chittoor: బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయిన తల్లిదండ్రులు

Chittoor: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బిడ్డను బాత్రూంలో వదిలి వెళ్లింది. రోగుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న డాక్టర్లు అక్కడకు చేరుకుని బిడ్డను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో కడుపు నొప్పి అంటూ 19 ఏళ్ల యువతి ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చారని.., అయితే ఆ యువతిపై అనుమానం వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని రావాలని పంపామని వివరించాడు. అయితే పరీక్ష చేయించుకోకుండా ఆ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలోకి వెళ్లి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆసుపత్రి నుండి పరార్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అయితే రోగుల సమాచారంతో తమ విషయం తెలుసుకుని బిడ్డకు వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతo శిశువు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉందని డాక్టర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories