Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

A Setback For Chandrababu In AP High Court
x

Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

Highlights

Chandrababu: సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు లాయర్లు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ తరఫు లాయర్ల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. హైకోర్టులో ఊరట దక్కుతుందని చంద్రబాబు అనుకున్నారు. కానీ క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించడంతో షాక్ తగిలినట్టైంది. దీనిపై పైకోర్టులో పోరాడతామని, సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ,చంద్రబాబు లాయర్లు చెబుతున్నారు.

అంతకు ముందు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ఊరట దక్కలేదు. స్కీల్ స్కామ్‌లో చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రెండు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించారు. చంద్రబాబు రిమాండ్ ఎల్లుండి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన 24వరకు జ్యూడిషీయల్ రిమాండ్‌లోనే ఉండనున్నారు. స్కిల్ స్కామ్‌లో ఈ నెల 9న చంద్రబాబును అరెస్టు చేసింది సీఐడీ. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా...14రోజుల రిమాండ్ విధించింది.

ఇటు మరో రెండు రోజుల పాటు రిమాండ్ పొడిగింపు, అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేతతో.. చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ కేసులో.. చంద్రబాబును విచారించాలని, డబ్బులు ఎలా చేతులు మారాయి, చివరికి ఎవరి అకౌంట్‌లోకి చేరాయనేది విచారించాల్సి ఉందన్నారు. అందుకు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరింది సీఐడీ. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పును మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలా 30 నిమిషాలకు తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును బట్టే.. కస్టడీపై నిర్ణయం తీసుకుందామనే ఏసీబీ కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనది 45ఏళ్ల రాజకీయ జీవితమని చంద్రబాబు జడ్జికి తెలిపారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చంద్రబాబు అన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని చెప్పారు. అన్యాయంగా తనను అరెస్టు చేశారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చంద్రబాబు జడ్జితో అన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వాదనలు విన్న తర్వాత జడ్జీ స్పందించారు. మీ మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమే అని న్యాయమూర్తి చంద్రబాబుతో అన్నారు. ఈ కేసులో ఇంకా ఎలాంటి తీర్పు రాలేదని న్యాయమూర్తి చంద్రబాబుకు చెప్పారు. కోర్టుకి ఒక విధానం ఉంటుందని.. వాటిని ఎవరు మార్చలేరన్నారు. కోర్టు దాని పరిధిలో పని చేస్తోందని న్యాయమూర్తి తెలిపారు. జ్యూడిషియల్ కస్టడీలో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలంటూ న్యాయమూర్తి చంద్రబాబు అడిగారు. మానసికంగా బాధపడవద్దంటూ చంద్రబాబుకు న్యాయమూర్తి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories