CAG: ఏపీ బడ్జెట్ నిధుల ఖర్చును తప్పు పట్టిన కాగ్

94,399 Crore Spent Out Of Budget In AP
x

CAG: ఏపీ బడ్జెట్ నిధుల ఖర్చును తప్పు పట్టిన కాగ్

Highlights

CAG: అనుమతి లేకుండానే ఏపీలో బడ్జెట్ నిధులు ఖర్చు చేశారని కాగ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తప్పు పట్టింది.

CAG: అనుమతి లేకుండానే ఏపీలో బడ్జెట్ నిధులు ఖర్చు చేశారని కాగ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తప్పు పట్టింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ర్టంలో మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్ అధికారులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏపీ ఫైనాన్సియల్ కోడ్ లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. మరో వైపు బడ్జెట్ లో వివిధ ప్రభుత్వ విభాగాలకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదని విశ్లేషించారు. ప్రతి నెలా ప్రభుత్వం ఖర్చుల వివరాలను కాగ్ కు అధికారులు సమర్పిస్తుంటారు. వాటిని అకౌంటెంట్ విభాగ అధికారులు పరిశీలించి బడ్జెట్ అంచనాల ప్రకారం ఎంత కేటాయింపులు జరిపారు ఎంత ఖర్చు చేశారు. రెవెన్యూ లోటు ఉందా.. మిగులు ఉందా .. ద్రవ్య లోటు ఉందా వంటి అంశాలపై నివేదికలు సమర్పిస్తుంటారు.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఏపీ ప్రభుత్వ ఖర్చులను కాగ్ పరిశీలించిన కాగ్... సంబంధిత నివేదికను వెల్లడించింది. ఖర్చు చేసిన నిధులను విశ్లేషించి లోపాలను గుర్తించి కాగ్ అధికారులు ఏపీ ఆర్ధిక శాఖ ముక్యకార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. ఈలోపాలను సరిదిద్ది పరిష్కార చర్యలను చేపట్టి కాగ్ కు తిరిగి తెలియచేయాలని సూచించారు. ఏదైనా ఖర్చు చేయాలన్నా బిల్లులు చెల్లించాలన్నా తప్పనిసరిగా బడ్జెట్ ప్రొవిజన్ ఉండాలని అయితే ఎలాంటి బడ్జెట్ అనుమతి లేకుండానే దాదాపు 124 అంశాల్లో 94 వేల 399.04 కోట్లను వివిధ ప్రభుత్వ శాఖలకు ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది. అంతే కాకుండా మొత్తం 947 అంశాల్లో బడ్జెట్ లో కేటాయింపులకు మించి 13 వేల 398.71 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వివిధ విభాగాల కింద 30 వేల 327.26 కోట్లు బడ్జెట్ కేటాయింపుల కింద ఖర్చు చేసేందుకు ప్రతిపాదించినప్పటికీ పైసా ఖర్చు చేయలేదు.

ప్రతి నెల మార్కెట్ నుంచి ప్రభుత్వం రుణాలు తీసుకుంటుంది. గతంలో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ రూపంలో కొంత మొత్తం చెల్లిస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో మూడు వేల 250 కోట్లను మార్కెట్ నుంచి, 81. 11 కోట్లు కేంద్రం నుంచి ప్రభుత్వం రుణం తీసుకుంది. కేంద్ర రుణాలకు సంబంధించి పాత చెల్లింపులు చేసినా బహిరంగ మార్కెట్ రుణాలకు చెల్లింపులు జరపలేదని కాగ్ లేఖలో వెల్లడించింది. కొన్ని అంశాల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మైనస్ ఖర్చు చూపించారని వివిధ శాఖలు నిబంధనలు ఉల్లంఘించినట్లు కాగ్ అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించే సమయంలోనే అంచనా వాస్తవ ఖర్చుల మధ్య తేడా లేకుండా చూసుకోవాలని కాగ్ అభిప్రాయ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories