Anantapur: నిమ్మకాయ గొంతులో ఇరుక్కుని 9 నెలల పసికందు మృతి

9 Months Old Child Died After Lemon Stuck In Throat In Anantapur
x

Anantapur: నిమ్మకాయ గొంతులో ఇరుక్కుని 9 నెలల పసికందు మృతి

Highlights

Anantapur: గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతుల కుమార్తె 9 నెలల చిన్నారి జస్విత ఇంట్లో ఆడుకుంటూ.. నిమ్మకాయ నోట్లో పెట్టుకోగ.. అది గొంతులో ఇరుక్కుంది.

Anantapur: ముక్కు పచ్చలారని చిన్నారిని ఓ నిమ్మకాయ బలిగొంది. ఆడుకుంటూ నిమ్మకాయను మింగిన చిన్నారి.. ఊపిరాడక మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతుల కుమార్తె 9 నెలల చిన్నారి జస్విత ఇంట్లో ఆడుకుంటూ.. నిమ్మకాయ నోట్లో పెట్టుకోగ.. అది గొంతులో ఇరుక్కుంది. బయటికి తీయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినా.. విఫలమయ్యారు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా... అక్కడా వీలుకాలేదు. అనంతపురం తీసుకెళ్తుండగా... మార్గమద్యంలోని పామిడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. అక్కడినుంచి అనంతపురం తీసుకెళ‌్లగా.. అప్పటికే చిన్నారి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories