ఏపీలో సరికొత్త రికార్డు.. శాసన సభకు కొత్తగా ఎన్నికైన 81 మంది అభ్యర్థులు

81 New Faces to Enter AP Assembly This Time
x

ఏపీలో సరికొత్త రికార్డు.. శాసన సభకు కొత్తగా ఎన్నికైన 81 మంది అభ్యర్థులు

Highlights

ఆంధ్రప్రదేశ్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఈ సారి 175 మందిఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్తగా ఎన్నికైన వారు కావడం విశేషం.

AP Assembly: శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితోపాటు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన సుజనాచౌదరి, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఈ సారి 175 మందిఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్తగా ఎన్నికైన వారు కావడం విశేషం. 81 మంది మొదటి సారిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. 81 మంది మొదటి సారిగా శాసన సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొదటి సారిగా ఎన్నికైన వారిలో పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష, పాతపట్నం నియోకవర్గం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గొండు శంకర్ ఉన్నారు.

విజయనగరం జిల్లాకు సంబంధించి బొబ్బిలి నుంచి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు, గజపతినగరం నుంచి కొండపల్లి శ్రీనివాసరావు, నెల్లమర్ల నుంచి లోకం నాగమాధవి, విజయనగరం నుంచి అదితి గజపతిరాజు మొదటి సారిగా ఎన్నికయ్యారు.

పార్వతీపురం మన్యంకు సంబంధించి పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ, కురుపాం నుంచి తోయక జగదీశ్వరి, పార్వతిపురం నుంచి బోనెల విజయచంద్ర, సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు.

అల్లూరి సీతారామరాజ జిల్లాలో అరకు వ్యాలీ నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి ఎం.విశ్వేశ్వరరాజు, రంపచోడవరం నుంచి మిరియాల శిరీష ఉన్నారు. విశాఖ దక్షణ నియోజకవర్గం నచి వంశీ కృష్టయాదవ్, అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ మొదటి సారిగా శాసన సభకు ఎన్నికయ్యారు.

కాకినాడ జిల్లా తుని నుంచి యనమల దివ్య, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్‌, రాజోలు నుంచి దేవవరప్రసాద్‌, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

తూర్పుగోదావరి రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, ఉండి నుంచి రఘురామరాజు , తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ఉన్నారు.

ఏలూరు జిల్లా ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, చింతలపూడి నుంచి సొంగా రోషన్‌కుమార్‌ ఉన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావ్‌, గుడివాడ నుంచివెనిగండ్ల రాము, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్‌ , పామర్రు నుంచి వర్ల కుమార్‌రాజా మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికనవారిలో ఉన్నారు.

ఎన్డీఆర్ జిల్లా తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ నుంచి సుజనాచౌదరి, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారాలోకేష్, ప్రత్తిపాడు నుంచి బీ. రామాంజనేయుడు, గుంటూరు పశ్చిమ నుంచి గళ్లా మాధవి, గుంటూరు తూర్పు నుంచి మహమ్మద్ నజీర్ మొదటిసారిగా శాసన సభకు ఎన్నికయ్యారు.

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి భాష్యం ప్రవీణ్‌ , నరసరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్ల నియోజకవర్గం నుంచి వేగేశన నరేంద్రకుమార్ మొదటి సారి ఎన్నికైన వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, కావలి నుంచి వెంకటకృష్ణారెడ్డి, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్‌ మొదటి సారిగా శాసన సభకు ఎన్నికయ్యారు.

కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం నుంచి టీజీ భరత్, పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, కొడుమూరు నుంచి బొగ్గుల దస్తగిరి, ఆదోని నుంచి పార్థసారథి, ఆలూరు నుంచి బి.విరూపాక్షి ఉన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి గిత్తా జయసూర్య, డోన్ నుంచి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి, శింగనమల నుంచి బండారు శ్రావణిశ్రీ,అనంతపురం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసా,కళ్యాణ దుర్గం నుంచి సురేంద్రబాబు ఉన్నారు.

సత్యసాయి జిల్లా మడకశిర నుంచి ఎంఎస్‌ రాజు, పెనుకొండ నుంచి సవిత , పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి, ధర్మవరం నుంచి సత్యకుమార్‌, వైఎస్సార్ జిల్లా కడప నుంచి మాధవిరెడ్డి, కమలాపురం నుంచి పుత్తా చైతన్యరెడ్డి, మైదుకూరు నుంచి సుధాకర్‌ యాదవ్‌ ఉన్నారు.

అన్నమయ్య జిల్లా నుంచి కోడూరు నియోజకవర్గం నుంచి అరవ శ్రీధర్‌, రాయచోటి నుంచి రాంప్రసాద్‌రెడ్డి, పీలేరు నుంచి ఎన్‌.కిశోర్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం నుచి గురజాల జగన్‌మోహన్‌,పూతలపట్టు నుంచి కలికి మురళీమోహన్‌ , నగరి నుంచి గాలి భానుప్రకాశ్‌, గంగాధర నెల్లూరు నుంచి థామస్ ఉన్నారు. తిరుపతి జిల్లా సూళ్ల్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీ, శ్రీకాళహస్తి నుంచి , బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి, చంద్రగిరి నుంచిపులివర్తి నాని ఉన్నారు. వీరంతా మొదటి సారి ఆంద్రప్రదేశ‌ శాసన సభలో అడుగెట్ట బోతున్నారు. వీరిలో అన్ని పార్టీలకు చెందిన వారున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories