Guntur: కరోనా విజృంభన.. చేజారిన గుంటూరు..స్పష్టత లేని గణాంకాలు

burial ground Guntur
x

శ్మాసనవాటిక పాత చిత్రం

Highlights

Guntur: అధికారులు చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితులకు భారీ తేడా

Guntur: గుంటూరు జిల్లాలో కరోనా ప్రాణాంతకంగా మారింది. కోవిడ్ సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అధికారులు చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితులకు భారీ వత్యాసం ఉంటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతితో గుంటూరులో స్మశానాలు మృత దేహాలతో నిండిపోయాయి. మహాప్రస్థానాలకు పదుల సంఖ్యలో మృతదేహాలు తరలివస్తున్నాయి. కోవిడ్ కు ముందు రోజుకు నాలుగైదు మృతదేహాలు వస్తే ఇప్పుడు మాత్రం 40 నుంచి 50 మృతదేహాలు అంత్యక్రియల కోసం తీసుకువస్తున్నారు.

ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతుంది. సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు చేరువవుతోంది. అలాగే.. మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories