Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా రెండవ రోజు ఉగాది మహోత్సవాలు...

2nd Day Ugadi Mahotasavas in Srisailam Today | Srisailam Temple News
x

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా రెండవ రోజు ఉగాది మహోత్సవాలు...

Highlights

Srisailam Temple: మహాదుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి దర్శనం

Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవ రోజు కన్నులపండువగా సాగాయి. మహాదుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనాదీసులైన స్వామివారికి అర్చకులు వేదపండితులు, ఈవో ఎస్.లవన్న దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు.

అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బాజా బజంత్రిలు , కోలాటాలు ,లంబాడీల ఆటపాటల నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్రపురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు బక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. కన్నడ భక్తిలనడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories