TDP 23 Number: 23 నెంబర్ వింటేనే టీడీపీలో వణుకు.. టీడీపీకి న్యూ మరాలజిస్టు అవసరమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు

23 Number Unlucky for TDP
x

TDP 23 Number: 23 నెంబర్ వింటేనే టీడీపీలో వణుకు.. టీడీపీకి న్యూ మరాలజిస్టు అవసరమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు

Highlights

TDP 23 Number: నిన్ను వీడను అంటూ చంద్రబాబును వెంటాడుతున్న 23

TDP 23 Number: ఆ నెంబర్ అంటేనే టీడీపీ క్యాడర్ వణికిపోతోంది. ఆ ఫిగర్ గురించి మాట్లాడితే చాలు.. పిడుగు పట్టట్టుగా ఉలిక్కిపడుతోంది. అధినేతకు చిక్కులు తెచ్చిన లెక్కంతా ఆ నెంబర్ చుట్టూ తిరుగుతుండడమే..ఈ షివరింగ్‌కు కారణమట. ఎనిమిదిలో మర్మముంది చూడరా అని బాషా సినిమాలో రజనీకాంత్ పాట మాదిరే.. ఆ నంబర్ గురించి తమ్ముళ్లు తెగ ఇదై పోతున్నారు. ఇంతకు చంద్రబాబును కలవర పెడుతున్న ఈ నెంబర్ ఏంటి..? ఇది నిజంగానే జగన్ అన్నట్టు దేవుడి స్క్రిప్టా..?

కేవలం సంఖ్య పరంగా చూస్తే.. 23నెంబర్ కు పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదు. కానీ టీడీపీకి మాత్రం ఇదో డేంజర్ నెంబర్‌గా మారింది. 23సంఖ్య వింటేనే టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి. మొదటి నుంచీ పార్టీకి చెడ్డ పేరు వచ్చినా లేక పార్టీ భవిష్యత్తుకు డౌన్ ఫాల్ స్టార్టయినా...దానికి ఈ నంబర్‌తో లింక్ ఉండటమే కారణమన్న అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు చంద్రబాబు. అప్పటి నుంచి టీడీపీకి.. 23 నెంబర్ సంఖ్య.. శత్రువుగా మారిపోయిందట. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151సీట్లు.. టీడీపి వచ్చిన స్థానాల సంఖ్య 23. ఆ ఫలితాలు వెల్లడైంది కూడా మే 23వ తేదీనే.

టీడీపీకి 23 సీట్లు రావాడాన్ని దేవుడు స్క్రిప్ట్‌గా అభివర్ణించారు జగన్. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చర్చుకున్న చంద్రబాబుకు.. ఎన్నికల్లో అదే 23 సీట్లు ఇచ్చాడంటూ నిండు అసెంబ్లీలో ఎద్దేవా చేశారు జగన్. ఇది యాధృచ్చికమే కావొచ్చు కానీ.. చంద్రబాబును అప్పటి నుంచి పగబట్టినట్టు పట్టింది 23సంఖ్య. ఏదో ఒక రూపంలో చంద్రబాబునును పదే పదే పలకరిస్తూనే.. వణుకుపుట్టిస్తోంది.

టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ముందుకు వెళ్లేందుకు.. సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలిసిన తేదీలు కూడా ఇరవైమూడేనని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ కథ ఇంతటితో ఆగకుండా చంద్రబాబు పవర్ కోల్పోయిన 23నెలల తర్వాత అవినీతి కేసులో నోటీసులు జారీ చేసి విచారణ కోసం 23వ తేదీనే హాజరుకావాలని సీఐడి అధికారులు చెప్పారు. ఇప్పుడు 2023లో స్కీమ్ స్కామ్ కేసులో.. ఏకంగా జైలు పాలు అయ్యారు చంద్రబాబు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో.. 2023లో తొలిసారిగా జైలుకు వెళ్లారు బాబు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. రాజమండ్రి జైలులో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. ఈ సంఖ్య మొత్తాన్ని కూడితే.. 23 వస్తుంది. దీంతో 23 నెంబర్ చంద్రబాబుకు గ్రహణం పట్టినట్టు పట్టిందనే టాక్ నడుస్తోంది.

2023లో 23నెంబర్ తో బాబు జైలుకు వెళ్లడాన్ని వైసీపీ నేతలు, శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నారు. 23 నెంబర్ ను గుర్తు చేస్తూ విజయసాయి రెడ్డి, డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేయడం గమనార్హం. కొన్ని నంబర్లు కొంతమందికి కలిసి రావన్న సెంటిమెంట్ ఉంటుంది. న్యూమరాలజీతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి టీడీపీకి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ న్యూమరాలజిస్టు అవసరం ఉందేమో అనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories