AP Corona Cases: ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు, 31 మంది మృతి

Corona virus Cases
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Highlights

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎన్నడూ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో...

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎన్నడూ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో తొలిసారి పది వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,871 పరీక్షలు నిర్వహించగా.. 10,759 కేసులు నిర్ధారణ కాగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున; అనంతపురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలో కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,541కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,992 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,22,977కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,35,169 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,474, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,97,462 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories