Old Woman Recovers COVID-19 : కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ..

Old Woman Recovers COVID-19 : కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ..
x
105 Years Old Woman Recovers From COVID-19 In kurnool
Highlights

Old Woman Recovers COVID-19 : కరోనా.. ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తున్న మహమ్మారి.. ఇప్పటికే చాలా మంది

Old Woman Recovers COVID-19 : కరోనా.. ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తున్న మహమ్మారి.. ఇప్పటికే చాలా మంది దీనీ బారిన పడి చనిపోగా, మరికొంతమంది పోరాటం చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఓ 105 ఏళ్ల వయస్సులో కూడా ఓ బామ్మ మాత్రం దైర్యంగా కరోనాని దైర్యంగా ఎదురుకొని పెద్దాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించి చాలా మందికి ఆదర్శంగా నిలిచింది ఈ బామ్మ...

ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానా వీధికి చెందిన ఈ బామ్మ పేరు బి.మోహనమ్మ.. ప్రస్తుతం ఆమె వయస్సు 105 ఏళ్లు. ఆమె భర్త మాధవస్వామి 1991లోనే మరణించారు.. ఆమెకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఇక కర్నూల్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి 60 ఏళ్లు దాటిన వారందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బామ్మ మోహనమ్మకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

అయితే ఈ పరీక్షల్లో ఆమెకి గత నెల 19న కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. అక్కడ ఆమెకి స్వల్ప జ్వరం తప్ప మరేమీ లక్షణాలు అయితే కనిపించలేదని ఆమె కుమారుడు వెల్లడించాడు. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోకుండానే కోలుకున్నారు. ఇక ఆమె గత నెల 31న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనాని జయించడం పట్ల ఆమె మాట్లాడుతూ.. రోగ్యకర అలవాట్ల వల్లే నేను కరోనాను జయించగలిగేలా చేశాయని, రోజు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేస్తుంటానని అవే నా ఆరోగ్య సూత్రాలు అని చెప్పుకొచ్చింది ఈ బామ్మ.

Show Full Article
Print Article
Next Story
More Stories