గంగుల వర్సెస్‌ సంజయ్‌ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్‌ ఏంటి?

Update: 2020-06-16 10:57 GMT

కనబడుటలేదు అంటూ కొందరు పోస్టర్లు వేశారు. పోటాపోటీగా ఏకంగా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు మరొకరు. ఎక్కడైనా కనబడితే చెప్పండి బాబూ అంటూ కనపడినవారినందర్నీ అడుగుతున్నారు. పాపం ఎవరో తప్పిపోయి వుంటారు కాబట్టి, పోస్టర్లు, ఫిర్యాదులు చేసి వుంటారులే అనుకుంటున్నారా. కాదు. అక్కడే అదిరిపోయే ట్విస్టుంది. కనిపించకుండాపోయింది, వారి బంధువులో, స్నేహితులో, పక్కింటోళ్లో కాదు మరెవరు. కయ్యానికే కయ్యమనిపించే, టగ్‌ ఆఫ్‌ వార్‌ కథేంటో చూడండి.

ఎవ్వరైనా కనిపించకుంటే ఠాణాల్లో ఫిర్యాదు చేయడం, పోస్టర్లు వేయడం కామన్. కాని ఆ జిల్లాలో లీడర్లు కనిపించడం లేదట. ఎంపిగా గెలిచిన పలానా లీడర్ ఎక్కడా అని పోస్చర్లేసి నిరసన చేస్తే తామేమి తక్కువ తిన్నామంటూ అసలు మంత్రులే కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లలోనే పిర్యాదులిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అనుకోవాలా లేక మంత్రి గంగుల వర్సెస్ ఎంపి సంజయ్ అనుకోవాలో తెలియదు కాని రెండు పార్టీల క్యాడర్ డీ అంటే డీ అంటూ పోటాపోటీగా రోడ్డెక్కుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరి టార్గెట్ ఎవ్వరు ఆ ఇద్దరి మద్య పచ్చ గడ్డేస్తేనే అంతగా ఎందుకు మండుతోంది.

బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్. ఇప్పుడు ఇద్దరి మధ్యేకాదు క్యాడర్ నడుమ కూడా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్రంలో గులాబీ పార్టీ హవా సాగుతున్న సమయంలో, అందునా గులాబీ గడ్డ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలువడం అధికార టీఆర్‌ఎస్‌కి మింగుడు పని విషయమే. అయితే సంజయ్ ను గులాబీ పార్టీ లీడర్లు కాని, అధికారులు కాని అంతగా పట్టించుకోవడం లేదు. ప్రోటోకాల్ ఎప్పుడో మరిచారు. మహా అయితే అరిచి గీ పెడుతారే తప్ప, బండి సంజయ్ ఏమి చేయలేరని డిసైడ్ అయ్యారో ఏమో కాని, బండిని అంతగా పట్టించుకోవద్దని టీఆర్‌ఎస్ డిసైడ్ అయినట్టుంది. ఇందులో భాగంగా ఇటీవల బావుపేట గ్రామంలో సంజయ్ కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎంపీగా బండి సంజయ్ గెలిచిన తరువాత తమ గ్రామానికి రాలేదంటూ ఓ ఫ్లెక్సీతో టెంట్ వేసుకుని కూర్చున్నారు. ఈ ధర్నాని చూపిస్తూ ఇది ఎంపీగా బండి సంజయ్‌కి సిగ్గు చేటు అంటూ రాజకీయంగా సోషల్ మీడియా,మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది టీఆర్‌ఎస్.

అయితే ఇదంతా టీఆర్‌ఎస్ పార్టీ పనే అంటూ బీజేపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ చేశారు. టీఆర్‌ఎస్ లో ఉన్న నాయకుడు ఒకరు దగ్గరుండి ఈ ధర్నా చేయించారని విమర్శిస్తూ కొన్ని చాటింగ్ స్క్రీన్ షార్ట్స్ ని విడుదల చేశారు. అయితే అవన్నీ ఎడిటింగ్ చేసి, మార్ఫింగ్ తో ఆ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియా లో పెట్టారంటూ బిజెపి శ్రేణులపై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు.

కానీ ఇప్పుడు ఈ గొడవ కాస్త ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వెళ్ళింది. కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలు, రాష్ట్ర మంత్రులు కనపడటం లేదంటూ పోలీస్ స్టేషన్‌లలో కంప్లైంట్స్‌ చేశారు. ఎంపీ సంజయ్ కనపడటం లేదంటూ బావుపేట గ్రామంలో ధర్నాకి కౌంటర్ గా, ఉమ్మడి జిల్లా మంత్రులు, తమ ప్రాంతాలకి రావడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. అయితే బావుపేట ధర్నా అంశంపై మంత్రి గంగుల కమలాకర్ సైతం మాట్లాడుతూ ఓ ప్రజాప్రతినిధిపై గ్రామస్థులు ఇలా చేయడం సరికాదంటూనే, టీఆర్‌ఎస్ ధర్నా చేయించిందని బీజేపీ అనడంపై ఫైర్ అయ్యారు. తాము ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయబోమన్నారు మంత్రి గంగుల.

నిజానికి బండి సంజయ్ ఎంపీగా గెలిచినా తరువాత వెంటనే అధ్యక్ష్య పదవి రావడం రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సి రావడంతో కరీంనగర్ పార్లమెంట్‌లో ఎక్కువ సమయం కేటాయించలేపోవడం కామన్ గానే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇంతా జరుగుతున్న బిజెపిలోని కార్యకర్తలు మినహా, జిల్లాస్థాయి నాయకులు మాత్రం కౌంటర్ సరిగా ఇవ్వలేకపోయారు. మరోవైపు ఎంపీ సంజయ్ కి షాక్ ఇస్తూ బిజెపి కార్పొరేటర్ ఒకరు టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఇక బిజెపిలో జిల్లా సీనియర్‌లు-సంజయ్‌కి మధ్య గ్యాప్ ఉండటంతో ఈ గొడవని పెద్దగా పట్టించుకోలేదట. ఏది ఏమైనా బావుపేట గ్రామం మాత్రం ఉన్నట్టుండి రాజకీయ వేడిని పెంచిందంటూన్నారు జిల్లా వాసులు.

Full View


Tags:    

Similar News