ఈటెల కోపం వెనక?

Update: 2020-06-29 03:34 GMT

రాష్ట్రంలో కీలకమైన మంత్రి నియోజకవర్గమది, కరోనా టైంలో ఆయనేమో బిజీబిజీగా ఉంటే ఆ నియోజకవర్గంలోని కొందరు నేతలు మాత్రం నిధుల పంపకాల కోసం గొడవలు పడుతున్నారట. ఈ విషయం సదరు మంత్రి దాకా వెళ్లడంతో చివాట్లు కూడా తిన్నారట సదరు ప్రజాప్రతినిధులు. ఇంతకీ ఏ నియోజకవర్గం అదీ.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ నియోజకవర్గం. ఆయనేమో కోవిడ్ 19 నేపథ్యంలో హడావుడిగా ఉంటే ఆయన నియోజకవర్గం హుజురాబాద్ మున్పిపాలిటీలో నిధుల పంచాయితీ గొడవ సాగుతోంది. హుజురాబాద్ మున్సిపాలిటిలోని కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ కి మద్య తగాదా పతాకస్థాయికి చేరిందట.

హుజురాబాద్ మున్సిపాలిటికి సంబంధించిన కౌన్సిలర్లు చైర్ పర్సన్ కి మద్య ఓ అత్యవసర సమావేశం జరిగిందట. ఈ సమావేశంలోనే గొడవకి నాంది పడినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 14,15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా సుమారుగా నాలుగు కోట్లకు పైగా ఫండ్స్ వచ్చాయి. అయితే ఆ నిధుల విషయంలోనే అత్యవసరంగా సమావేశం పెట్టుకున్న కౌన్సిలర్లు-చైర్ పర్సన్ కి మధ్య కొంత విభేదాలు వచ్చాయి. ఆ రగడ కాస్తా మంత్రి దాకా చేరిందట.

మున్సిపాలిటికి వచ్చిన మొత్తం నాలుగు కోట్లకు పైగా నిధులతో స్థానికంగా చెయ్యాల్సిన అభివృద్ది పనులపై ఆ సమావేవంలో చర్చించారు. రోడ్లు, డ్రైనేజిలు ఇలా అన్ని అంశాలపై చర్చించిన మున్పిపల్ కౌన్సిల్ చివరికి ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే ఆయా పనుల్లో భాగంగా చైర్ పర్సన్ కి సంబంధించిన డివిజన్ లో, అందరికంటే 25 శాతం ఎక్కువగా ఫండ్స్ కావాలని ప్రతిపాదన పెట్టారట. దీంతో పాటుగా వైస్ చైర్మన్ కూడా అదే ప్రతిపాదన తెచ్చారట. ఇది మిగతా కౌన్సిలర్లలో చాలామందికి నచ్చలేదు. రగడ కాస్తా అప్పుడే కమిషనర్ దాకా వెళ్లింది.

ఇలా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ అధిక నిధుల కోసం పట్టుబడటంతో అధికార-ప్రతిపక్ష కౌన్సిలర్ లు ఏకమయ్యారు. ఫండ్స్ సమానంగా పంచాలంటూ కమిషనర్ కి వినతి పత్రం కూడా ఇచ్చారట. ఈ విషయం కాస్త కోవిడ్ బిజీలో ఉన్న మంత్రి ఈటెల దాకా వెళ్లడంతో, కౌన్సిలర్లు-చైర్ పర్సన్ లకి క్లాస్ తీసుకున్నారట మంత్రి. గెలిచి ఏడు నెలలు కూడా కాలేదు. అప్పుడే నిధుల పంచాయితీ తెచ్చారా అంటూ ఘాటుగానే మందలించినట్టు సమాచారం. ఏదిఏమైనా మంత్రేమో అక్కడ కరోనా బిజీలో ఉండగా ఇక్కడేమో కౌన్సిలర్లు నిధుల కోసం పంచాయితీ తేవడం చర్చనీయాంశంగా మారింది.

Full View


Tags:    

Similar News