Hyderabad University Best Ranked: పీహెచ్ సీకి రెండో స్థానం.. ఇండియా టుడే సర్వే

Hyderabad University Best Ranked: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరో ప్రగతి సాధించింది. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో రెండో స్థానంలో నిలిచింది.

Update: 2020-08-03 06:56 GMT

Hyderabad University Best Ranked: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. ఇండియా టుడే ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన ఓ సర్వేలో హెచ్‌సీయూకి రెండోస్థానం దక్కింది. జనరల్‌ (ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌), సాంకేతిక, వైద్య, లాలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ అందిస్తున్న దేశంలోని 995 యూనివర్సిటీల్లో సర్వే నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా వర్సిటీ పాలనా పద్ధతులు, అకడమిక్‌, పరిశోధనలు, మౌలిక వసతులు, పర్సనాలిటీ, లీడర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌, కెరీర్‌ పురోగతి, ప్లేస్‌మెంట్లు తదితర వాటిని వర్సిటీ పనితీరుకు సూచికలుగా తీసుకున్నారు. ఆబ్జెక్టివ్‌ ర్యాంకింగ్‌ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్‌ఏ 120 ప్లస్‌ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. పది పాయింట్ల రేటింగ్‌ స్కేల్‌లో వర్సిటీల ర్యాంకులను నిర్ధారించారు. ఢిల్లీలోని జేఎన్‌యూ మొదటిస్థానం సాధించగా, హెచ్‌సీయూ రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. మెరుగైన ర్యాంకు రావడం వర్సిటీ పరిశోధనా పద్ధతులకు గుర్తింపని హెచ్‌సీయూ వీసీ పొదిలే అప్పారావు చెప్పారు.

995 వర్సిటీలపై అధ్యయనం

ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. అందులో 155 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. వీటిల్లో హెచ్‌సీయూకు ద్వితీయ స్థానం పొందింది. ఇండియా టుడే నాలెడ్జ్‌ పార్టనర్‌ ఎండీఆర్‌ఏ చేత అనేక మైలురాళ్లను నిర్దేశించింది. ఆబ్జెక్టివ్‌ ర్యాంకింగ్‌ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్‌ఏ 120 ప్లస్‌ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఈ పనితీరే సూచికలుగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లివింగ్‌ ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్‌ పురోగతి, ప్లేస్‌మెంట్‌ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. దేశంలోని 30 నగరాల్లో 300 మంది ప్రతినిధులు(32 మంది వైస్‌చాన్స్‌లర్లు, 75 మంది డైరెక్టర్లు, 193 మంది సీనియర్‌ ఫ్యాకల్టీ/ప్రొఫెసర్లు/హెడ్‌లతో వర్చువల్‌ సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్‌ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా పీహెచ్ యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు మాట్లాడుతూ పనితీరు మెరుగుపడడం, పరిశోధన రచనలకు గుర్తింపుగా హెచ్‌సీయూ దేశంలో ద్వితీయ స్థానం సాధించిందన్నారు. 2017లో 5వ స్థానం, 2018లో 3, 2019లో 2, 2020లో మరోసారి 2వ స్థానాన్ని హెచ్‌సీయూ దక్కించుకుందన్నారు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ గుర్తించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతోపాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాం. దీంతో ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్‌లోకి వెళ్లేలా సమష్టి కృషితో ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు.  

Tags:    

Similar News