వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పీఎస్ సమీపంలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. సురేష్ అనే కారు డ్రైవర్ హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రా హారిణి సురేష్‌ను లైంగిక వేధింపులకు గురిచేయడంతోనే భరించలేక కత్తితో పొడిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు.