బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి!

Update: 2020-05-27 15:53 GMT

మెదక్ జిల్లాలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు.. ఈ ఘటన పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నీళ్లు కోసం 120 అడుగులు లోతులో బుధవారమే బోరు బావి తవ్వారు.. అయితే తవ్వి నీళ్లు రావడం లేదని అలాగే వదిలేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ బోరు సమీపంలో ఆదుకోవడానికి వెళ్లిన సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. బాలుడి కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో మెదక్‌ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌, మరో ఎస్సై ఆంజనేయులు సహా స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరకున్నారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బలగాలను తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మంగలి గోవర్ధన్ నవీనల మూడో కుమారుడు సాయి వర్ధన్‌. నాలుగు నెలల కిందట అమ్మమ్మ ఊరైన పోడ్చన పల్లి గ్రామానికి అందరూ వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సాయి వర్ధన్‌ బోరు బావిలో పడిపోయాడు. కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో ఆ తల్లి దండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కుమారుడిని కాపాడమంటూ అధికారులను వేడుకుంటున్నారు.


Tags:    

Similar News