హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కళామందిర్‌లో దొంగతనం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ 9 లక్షలు అపహరించాడు. చోరీ అనంతరం తన కుటుంబంతో పాటు పరారయ్యాడు మోనీదాస్. విషయం తెలుసుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళామందిర్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.